MUSIC: ILAYARAJA SUNGBY:KARTHIK
LYRICS:ANANTHA SREERAM
కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్ళు
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం తేలకుండ ఉన్నన్నాళ్ళు
నీ తపస్సు నే చేస్తుంటానే
గాలి లోన ఆరోప్రాణం కలవకుండ ఉన్నన్నాళ్ళు
గాలి లోన ఆరోప్రాణం కలవకుండ ఉన్నన్నాళ్ళు
నిన్ను నేనే ఆరాధిస్తా నీకోసం ఆరా తీస్తా
కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్ళు
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం తేలకుండ ఉన్నన్నాళ్ళు
నీ తపస్సు నే చేస్తుంటానే
ఏడు వింత లున్నన్నాళ్ళు నీకు తోడునైవుంటా
పాల పుంత ఉన్నన్నాళ్ళు నన్ను పంచి నేనుంట
పాదమున్న నాళ్ళు నీ వెనకలాగ నేనుంట
కోరుకున్న చోటల్లా చేర్చుతా
చేతులున్ననాళ్ళు నీ గీతలాగ నేనుంట
జాతకాన్ని అందంగా మార్చుతా
అంకెలింక ఉన్ననాన్లు నీ వయస్సు సంఖ్యా వలే
ఆ సంఖ్యలల్లో బంధిస్తుంట వందఎళ్ళిలా
కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్ళు
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం తేలకుండ ఉన్నన్నాళ్ళు
నీ తపస్సు నే చేస్తుంటానే
భాషనేది ఉన్నన్నాళ్ళు నిన్ను పొగిడి నేనుంట
ధ్యాసనేది ఉన్నన్నాళ్ళు నిన్ను తలచి నేనుంట
వెలుగు ఉన్న నాళ్ళు నీ వెనుక నేను వేచుంటా
నువ్వేటేపు వెళుతున్న సాగనా
మసక ఉన్న నాళ్ళు నీ ముందుకొచ్చినిలుచుంట
నువ్వెలాగ ఉన్నవో చూడన
నీకు దూరమున్నన్నాళ్ళు జ్ఞాపకంగ వెంటుంట
మళ్ళి మళ్ళి గురుతోస్తుంట ముందు జన్మల
కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్ళు
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం తేలకుండ ఉన్నన్నాళ్ళు
నీ తపస్సు నే చేస్తుంటానే
గాలి లోన ఆరోప్రాణం కలవకుండ ఉన్నన్నాళ్ళు
గాలి లోన ఆరోప్రాణం కలవకుండ ఉన్నన్నాళ్ళు
నిన్ను నేనే ఆరాధిస్తా నీకోసం ఆరా తీస్తా
కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్ళు
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం తేలకుండ ఉన్నన్నాళ్ళు
నీ తపస్సు నే చేస్తుంటానే
No comments:
Post a Comment